విజయన్ కు స్వాగతం పలికిన సిపిఎం బృందం
ఖమ్మంలో రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రసంగించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వ అతిధి గృహంలో సిపిఎం ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా ఈరోజు సాయంత్రం కలిసింది.
సిపిఎం ప్రతినిధి బృందంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, డిజి నరసింహారావు, జూలకంటి రంగారెడ్డి, టీ సాగర్ ఉన్నారు.